Home రాజకీయాలు పవన్-జగన్ వివాదం; నాగబాబు జోక్యం!

పవన్-జగన్ వివాదం; నాగబాబు జోక్యం!

SHARE

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వివాహాల పై విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. జగన్ పై పవన్ అభిమానులు విచ్చలవిడిగా దండెత్తడం…సోషల్ మీడియా లో చిల్లర కామెంట్లు చేయటం నుంచి, జగన్ కుటుంబ సభ్యులని కూడా లాగటం….ఇలా జరుగుతున్నా నేపధ్యం లో ఎంతో మంది….శ్రీ రెడ్డి సహా…పలు వీడియోలు సోషల్ మీడియా లో పెట్టడం అవి వైరల్ అవ్వడం తెలిసిందే.

ఇప్పుడిప్పుడే పవన్ క్రియాశీల రాజకీయాల్లో బిజీ అవుతున్నాడు…ఇటువంటి సందర్భం లో అనవసర డివెర్సిన్ లు అనుకున్నాడో ఏమో పవన్ ట్విట్టర్ సాక్షి గా అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అయితే ఇది ఇంకా ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ప్రముఖులు కూడా ఈ విషయం పై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు స్పందించారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కావని ఆయన అన్నారు. పవన్ ఎవరినీ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయలేదని ఆయన గుర్తు చేశారు.

ఇక విడాకులు తీసుకోవడానికి కారణ౦ భార్యాభర్తల విషయమని చెప్పి అయినా పవన్ చట్టబద్ధంగానే విడాకులు తీసుకున్నాడని అందులో ఏ వివాదం లేదని నాగబాబు పేర్కొన్నారు. పవన్ మొదటి భార్య నందిని గానీ, రేణూ దేశాయ్ గానీ ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవని కూడా నాగబాబు గుర్తి చేశారు. చట్టబద్ధంగా విడిపోయి తన మానాన బతుకుతున్న వ్యక్తిపై ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదని నాగబాబు అన్నారు.

పవన్ ను టీడీపీ, వైసీపీ రెండూ కూడా తక్కువ అంచనా వేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.