Home రాజకీయాలు మీరు కాదు మీ జేజెమ్మ కూడా నన్ను ఓడించలేడు: చింతమనేని

మీరు కాదు మీ జేజెమ్మ కూడా నన్ను ఓడించలేడు: చింతమనేని

SHARE

జనసైనికుల కి చింతమనేని సవాల్ విసిరారు. టిడిపి ఎమ్మెల్యే, మరియు పార్టీ విప్ చింతమనేని ప్రభాకర్ జనసేన కు ఓ సవాల్ విసిరారు. పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారని, తనను ఓడించి, జనసేన పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తామని వారు ఆవేశంతో ప్రగల్భణాలు పలుకుతున్నారని … ఆయన అ౦టూ మీరే కాదు….మీ జేజేమ్మలు వచ్చినా కూడా నన్ను ఓడించలేరని చింతమనేని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ విడిపోవడ౦లో మొదటి ముద్దాయి చిరంజీవి అని చింతమనేని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు కూడా అమ్ముకుని మద్దతు పలికితే వాళ్లను చిరంజీవి బలి పశువులను చేసారని దెందులూరు ఎం ఎల్ ఏ అన్నారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత ఎవరిది అంటే అది చిరంజీవేనని ఆయన ద్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆయన చిరంజీవి ద్రోహం గురించి ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. చిరంజీవిని ప్రశ్నించడానికి రక్తసంబంధం అడ్డొస్తోందా అని ఆయన అన్నారు.