Home రాజకీయాలు తెదేపా ధర్మ పోరాట దీక్షకు మద్దతు కావాలంట…సిగ్గుందా?

తెదేపా ధర్మ పోరాట దీక్షకు మద్దతు కావాలంట…సిగ్గుందా?

172
SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు బహు విచిత్రం…రోజూ చెప్పేదే మళ్లీ మళ్లీ చెప్తుంటారు. విషయానికొస్తే సీఎం తెదేపా ఎమ్.పిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని కధనం. ఇక అందులో బిజెపి నే మరోసారి యుటర్న్ తీసుకుందని తాను యూ టర్న్ తీసుకోలేదని ఆయన చెప్పారు….తమది ఎప్పుడూ సరైన రూటేనని అన్నారు.

భాజపా చేసిన అన్యాయాన్ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒంగోలు ధర్మపోరాటసభకు పార్టీ ఎంపీ లు హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఇక్కడే తన బుద్ధి చూపించుకున్నారు బాబు. ఒంగోలు ధర్మపోరాట సభ జరిగే రోజే మరోచోట పోటీ దీక్షలు చేస్తున్నారని… అదే భాజపా, వైకాపా, జనసేన పార్టీల లాలూచీ బట్ట బయలు చేస్తోందని.. ప్రజల౦తా దీన్ని గమనిస్తున్నారని బాబు అన్నట్టు లీక్ వచ్చింది.

విపక్ష పార్టీ బంద్ చేస్తుంటే మాత్రం అది విఫలం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది బాబు ప్రభుత్వం, ఇప్పుడు వారు చెప్పుట బోయే దర్మ పోరాట దీక్ష కు అన్ని పార్టీ ల వారు సహకరించాలని కోరటం ఏ౦ రాజకీయమో బాబే చెప్పాలి!!