Home రాజకీయాలు “నా వల్లే టీడీపీ కి ఈ జిల్లాలో 15 ఎంఎల్ఏ సీట్లు”

“నా వల్లే టీడీపీ కి ఈ జిల్లాలో 15 ఎంఎల్ఏ సీట్లు”

SHARE

ఓ పక్కేమో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రజ్ఞ వల్లే ఎపి లో తెదేపా అదికారంలోకి వచ్చింద౦టారు…పవన్ కానీ బిజెపి ల ప్రభావం కాని ఏ మాత్ర౦ లేదని తనకి తనే ప్రచారం చేస్తుంటే, ఇంకో వైపేమో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తానే తెదేపా అధికారంలో రావటానికి సహాయపడింది అంటారు.

పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపికి పదిహేను సీట్లు వచ్చాయ౦టే అది తన చలవే అని పవన్ అన్నారు. భీమవరంలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ తాను కేవలం ఒక్క మాట చెప్పినందుకు గాను ఈ జిల్లాలో పదిహేను సీట్లు టిడిపికి వచ్చాయని ఆయన అన్నారు.

అయితే ఇంత చేసిన జిల్లాకు కూడా టిడిపి అన్యాయం చేసిందని ఆయన వాపోయారు.ఈ జిల్లాతో రాజకీయ అనుబందం ఏర్పడడం తనకి సంతోషంగా ఉందని అన్నారు పవన్ కళ్యాణ్!