Home సినిమా కార్తీ అయ్యెన్ జగన్!

కార్తీ అయ్యెన్ జగన్!

49
SHARE

వైస్సార్ పై తీస్తున్న బయోపిక్, యాత్ర, మహి.వి రాఘవ్ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోంది రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డిగా చేస్తున్నారు. ఆయన పోర్షన్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఎంతో స్పీడ్ గా జరిగిపోతోంది.

అయితే ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ పాత్ర ఎంతో కీలకం కానుంది. ఈ పాత్రకు ముందుగా సూర్య అయితే బాగుంటుందని ఆయనను సంప్రదించారట కూడా అయితే ప్రస్తుతం సూర్య ప్రస్తుతం చాలా బిజీ గా ఉండడంతో దర్శక నిర్మాతలకి తన పరిస్థితి చెప్పాడట. అంతే కాక్ ఈ పాత్రకి కార్తీ ఇంకా బాగా సెట్ అవుతాడని కూడా సూచించాడట.

ఇంకేముంది దాంతో జగన్ పాత్రకు కార్తీ పేరు ఖరారైపోయినట్టే అని ఫిల్మ్ నగర్లో టాక్ బలంగా వినపడుతోంది. కార్తీ ఒకే అని మీరు ఫీల్ అవుతున్నారా?