Home ప్రత్యేకం మిస్టర్‌ కూల్‌ రామ్‌చరణ్‌

మిస్టర్‌ కూల్‌ రామ్‌చరణ్‌

SHARE

 బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఇక్కడ ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో చూశారుగా. ఇది ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌లోనిదే అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇన్ని రోజులూ బోయపాటి సినిమాలో రామ్‌చరణ్‌ హీరోగా అంటే మాస్‌.. ఊరమాస్‌ అని ఊహించాం. కానీ ప్రస్తుతం ఈ ఫొటోను చూస్తుంటే మాస్‌ అంశాలతో పాటు ఈ సినిమాలో కూల్‌ యాంగిల్‌ కూడా ఉంటుందని ఊహించవచ్చు.

అలాగే ‘రంగస్థలం’ సినిమాలో చిట్టిబాబుగా లుంగీ కట్టిన రామ్‌చరణ్, ఈ సినిమాలో పంచె కట్టు సీన్స్‌తో అలరించనున్నారని ఫొటోను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోందని సమాచారం. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో స్నేహ, హిమజ, ప్రవీణ, ప్రశాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.