Home సినిమా భార్య అందంపై బన్నీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

భార్య అందంపై బన్నీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

SHARE

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన భార్య స్నేహారెడ్డి ఫోటో షేర్ చేసిన బన్నీ.. వీరి వ్యక్తిగత జీవితానికి, సినిమాలకు సంబంధించిన విషయాలను నటుడు అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి బన్నీ తన భార్య గురించి చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

‘ఓఎంజీ (ఓ మై గాడ్‌)! నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇంత అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నానా’అంటూ భార్య స్నేహారెడ్డి అందంపై బన్నీ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. గోదుమ రంగులో ఉన్న సల్వార్‌ కమీజ్‌ను ధరించిన తన భార్యను ప్రముఖ స్టైలిస్ట్‌ హర్మన్‌ కౌర్‌ చాలా అందంగా ముస్తాబు చేశారని అల్లు అర్జున్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. బన్నీ పోస్టుకు భారీగా లైక్స్‌, కామెంట్లు వస్తున్నాయి. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని, స్నేహారెడ్డి చాలా అందంగా ఉన్నారని కొందరు కామెంట్‌ చేస్తుండగా.. సార్‌ మీ తర్వాతి మూవీ అప్‌డేట్స్‌ చెప్పండంటూ మరికొందరు ఫ్యాన్స్‌ కామెంట్లలో అడుగుతున్నారు.

కుటుంబంలో ప్రతి ఒక్కరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఫొటోలు షేర్‌ చేసే బన్నీ తాజాగా.. భార్య అందాన్ని పొగుడుతూ పోస్ట్‌ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’  తర్వాత బన్నీ ఏ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చార్‌, ఏ దర్శకుడితో పనిచేస్తున్నారన్న విషయాలపై నటుడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోటీన్ సినిమాలు కాకుండా భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని, కాస్త లేటైనా భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంలో న్నారు. త్వరలో అల్లు అర్జున్ విక్రమ్‌ కె కుమార్‌ ప్రాజెక్టుకు ఓకే చెప్పే అవకాశం ఉందని, నల్లమలుపు బుజ్జి, నాగ అశోక్‌ కుమార్‌ ఈ మూవీని నిర్మించ బోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం అఫీషియల్ ఖరారు కావాల్సి ఉంది.

OMG ! I can’t Believe I married such a pretty Woman 😂 . Styled by @harmann_kaur_2.0

A post shared by Allu Arjun (@alluarjunonline) on