Home రాజకీయాలు అమ్మ పెట్టా పెట్టదు…అడుక్కుతినానివ్వదు లా వుంది బాబు తీరు!!

అమ్మ పెట్టా పెట్టదు…అడుక్కుతినానివ్వదు లా వుంది బాబు తీరు!!

210
SHARE

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం పై పోరాడకుండా రాష్ట్ర బంద్ చేపట్టడమేమిట౦టూ విపక్ష పార్టీ వైకాపా పై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు.

బంద్ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో అశాంతి వాతావరణం వల్ల వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా పోతాయంటూ మండిపడ్డారు. పోరాటం ప్రజలపై ఉండకూడదని అందరం కలసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల౦టూ సూచించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులపై తాము చేసే పోరాటం మాత్రం కొనసాగుతుందని చెప్పారు.

ముఖ్యమంత్రి ఈ రోజు ఈ ఉదయం టీడీపీ ఎంపీ లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాజ్యసభలో విభజన హామీల గురించి జరిగే చర్చ పై పార్టీ ఎంపీ లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఏపీ కి జరిగిన అన్యాయాన్ని రాజ్యసభలో ఎండగట్టాలని తమ నాయకులకు సూచించారు.

యూ టర్న్ లు తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలని కాలరాచిన బాబు తీరు అమ్మ పెట్టా పెట్టదు…అడుక్కుతినానివ్వదు లా వుంది…తానూ ఎలాగు నోరు విప్పి కేంద్రం పై ఓ మాట అనలేదు…బంద్ చేస్తున్న విపక్ష పార్టీ నేతలను మాత్రం అరెస్ట్ లు చేస్తారా…?? ఇంతకన్నా అన్యాయమైన ప్రభుత్వం మరొకటి ఈ దేశంలో ఉందా??