Home రాజకీయాలు బంద్ విజయవంతం, దుర్గారావు మృతి శోచనీయం: జగన్

బంద్ విజయవంతం, దుర్గారావు మృతి శోచనీయం: జగన్

130
SHARE

ఏపీ కి జరుగుతున్న అన్యాయం పై ఎన్డీఏ సర్కారు తీరు ను తీవ్రంగా నిరసిస్తూ ప్రతిపక్ష వైకాపా పిలుపు మేరకు ఈ రోజు ఏపీ బంద్ జరిగిన విషయం తెలిసిందే.

బంద్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వైకాపా అధ్యక్షుడు వై ఎస్ జగన్ మాట్లాడుతూ, ఏపీ బంద్ విజయవంతంగా జరిగిందని అన్నారు. ఆంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారని చెప్తూ ఇది ఏపీ ప్రజల హోదా ఆకాంక్షని తెలియచేస్తోందన్నారు. ప్రజల హోదా ఆకాంక్ష కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వం బంద్ ను అణచివేయాలని ఎంతగానో ప్రయత్నించిందని విమర్శించారు.

అయితే బుట్టాయిగూడెంలో బంద్ లో పాల్గొన్న వైసీపీ కార్యకర్త కాకి దుర్గారావు మృతి చెందటం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు తో కలిసి దుర్గారావు కూడా బంద్పా లో పాల్గొన్నాడు. కానీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి దుర్గారావు ను స్టేషన్ కు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దుర్గారావు మృతి నేపథ్యంలో జగన్ స్పందిస్తూ దుర్గారావు గుండెపోటుతో చనిపోయాడని, అతని మృతికి సీఎం చంద్రబాబే కారణమని ఆరోపించారు!!