Home రాజకీయాలు “కారు మార్చిన‌ట్లు ప‌వ‌న్ పెళ్లాన్ని మారుస్తారు…”

“కారు మార్చిన‌ట్లు ప‌వ‌న్ పెళ్లాన్ని మారుస్తారు…”

173
SHARE

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా విష‌యంలో బాబు మోసం ఎన్డీఏ స‌ర్కారు అన్యాయానికి వ్య‌తిరేకంగా వైసీపీ చేపట్టిన ఏపీ బంద్ స‌క్సెస్ అయింద‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తెలిపారు. బాబు స‌ర్కారు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు వ్య‌తిరేకంగా బంద్‌ ను అణిచి వేసే ప్ర‌య‌త్నం చేసింద‌ని మండిప‌డ్డారు.

ఇక …మా పార్టీకి ప‌ది మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీనీ స్తంభింప చేసేవాడిన‌ని ప‌వ‌న్ అన్న వ్యాఖ్య‌ల‌కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ మాటల్లో: మన ఖర్మేంటంటే ఇవాళ పవన్ కల్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నా మనం వినాల్సి వస్తోంది. నిజంగా, ఇది మన ఖర్మే….నాలుగేళ్లు ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారితో, బీజేపీతో ఇద్దరితో కలిసి కాపురం చేశాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీ, బీజేపీల నుంచి ఆయన బయటకొచ్చి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. ఒకరేమో ’నేను తప్పు చేశాను’ అంటాడు. ఇంకో ఆయనేమో ‘నేను కాదు తప్పు చేసింది..మిగతా ఇద్దరు’ అంటాడు. మరో ఆయనేమో ‘ఆ ఇద్దరూ ఆమోదం తెలిపిన తర్వాతే..’ అని అంటాడు.

చంద్ర‌బాబుకు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి ట్వీటో లేక ఇంట‌ర్యూ ఇచ్చి వెల్తార‌న్నారు. నాలుగు సంవ‌త్స‌రాలుగా ఇదే జ‌రిగింద‌న్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మాట్లాడటం మొదలు పెడితే.. దానికి మనం సమాధానం చెప్పాలంటే..ఎక్కడున్నాయి విలువలు? వాటి గురించి ప‌వ‌న్ మాట్లాడ‌టం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు.

కొత్త కారును మార్చినట్టుగా పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారో ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు. మీరో, నేనో ఈ పని చేస్తే.. ‘నిత్యపెళ్లికొడుకు’ అని బొక్కలో వేస్తారా? లేదా? ఇది పాలీగామీ కాదా? ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు బయటకొచ్చి.. తానేదో సచ్ఛీలుడను అని మాట్లాడతార‌ని ఆరోపించారు.