Home రాజకీయాలు హోదాకు వ్యతిరేకం కాకపోతే బంద్‌ను ఎందుకు అడ్డుకుంటారు?

హోదాకు వ్యతిరేకం కాకపోతే బంద్‌ను ఎందుకు అడ్డుకుంటారు?

252
SHARE

రేపు రాష్ట్ర బంద్ కు వైకాపా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తూ
జగన్ బంద్ కు పిలుపిచ్చారు. తెదేపా ఎంపీ లను రాజీనామా చేసి దీక్ష రమ్మని జగన్ విజ్ఞప్తి చేశారు. అయితే బంధు కు టీడీపీ వ్యతిరేకం.

దీనిపై వైకాపా తీవ్ర వ్యాఖలు చేసింది. పార్టీ ఎం ఎల్ ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తెదేపా ధర్మ దీక్షల పేరిట కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కూడా పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.

డ్వాక్రా, అంగన్ వాడీ, ఉపాధి హామీ మహిళలను మభ్యపెట్టి దీక్షలకు తరలించి చంద్రబాబు డ్రామాలు ఆడుతారని అన్నారు. టీడీపీ, బీజేపీలు మిత్రులేనన్న విషయం పార్లమెంటు సాక్షిగా స్పష్టమయిందని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే రేపు వైసీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సహకరించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు.

మరో పక్క జగన్ ట్వీట్ తెదేపాని సంకటం లో నెట్టాయి. ప్రత్యేక హోదాకు చంద్రబాబుగారు, టీడీపీ వ్యతిరేకం కాకపోతే బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు.. అంటూ జగన్ చేసిన వ్యాఖ్య వైరల్ గా మారింది.