Home రాజకీయాలు ఎపిలో ముందుగా బాబు, లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..

ఎపిలో ముందుగా బాబు, లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..

63
SHARE

ఎపిలో ఫైబర్ గ్రిడ్ ద్వారా కేబుల్ టీవీ తీసుకున్నవారు ఆయా ప్రోగ్రాంలు చూడాలంటే బలే తమాషా ఇబ్బంది పడుతున్నారట. విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ వద్దకు వచ్చిన కేబుల్ ఆపరేటర్లు ఈ విషయాలను పిర్యాదు చేశారు. పైబర్ గ్రిడ్ లో చేరని ఆపరేటర్లపై పోల్ పన్ను వేస్తూ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వారు వాపోయారు. పైబర్ గ్రిడ్ లో కేబుల్ తీసుకున్నవారు టివీ చూడాలంటే ముందుగా ఐదు నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబను, ఆయన కుమారుడు లోకేష్ ను, వారు చేప్పే విషయాలను ప్రభుత్వ పదకాల గురించి చాడాల్సి ఉంటుందట. దానితో ప్రజలు చికాకు పడుతున్నారని వారు వివరించారు.కేబుల్ ఆపరేటర్లను చంద్రబాబు నాయుడు నానా యాతన పెడుతున్నారని వారు వాపోయారు.

బ్రాడ్‌ బ్రాండ్, కేబుల్‌ ఆపరేటర్స్‌ను టీడీపీ సర్కార్‌ దోచుకుంటోందని విమర్శించారు. కార్పొరేట్‌ అండర్‌ గ్రౌండ్‌ పేరుతో టీడీపీ పెత్తనం చేస్తోందని వారు చెప్పారు. అధికారంలోకి రాగానే ఫైబర్‌ గ్రిడ్‌ చట్టం తెస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని కేబుల్‌ సంఘాల ఆపరేటర్స్‌ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పోల్‌ ట్యాక్స్‌ను సైతం వైఎస్‌ జగన్‌ తీసేస్తామని చెప్పారని వారు తెలిపారు.