Home రాజకీయాలు కేబుల్ టీవీ చూడాలంటే; బాబు, లోకేష్ ల సుత్తి భరించాలా?

కేబుల్ టీవీ చూడాలంటే; బాబు, లోకేష్ ల సుత్తి భరించాలా?

SHARE

ఎపి లో ఫైబర్ గ్రిడ్ ద్వారా కేబుల్ టీవీ కారు చవకగా ఇస్తున్నట్టు చంద్రబాబు ఊదరగొట్టిన విషయం గుర్తుంది కదా…ఇక ఈ కేబుల్ టీవీ తీసుకున్నవారు టీవీ ప్రోగ్రాంలు చూడాలంటే మాత్రం ఓ కండిషన్ … ఇష్టం వున్నా లేకున్నా ఓ ఐదు నిమిషాల బాబు మరియు లోకేష్ ల సుత్తి చూడాల్సిందే….! ఇక వారి ఇబ్బందీ, పాట్లూ పై వాడికే ఎరుక!

విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ దగ్గరకు కేబుల్ ఆపరేటర్లు వచ్చి ఈ విషయాలు చెప్పారు. ఇంకా పైబర్ గ్రిడ్ లో చేరని ఆపరేటర్ల కు పోల్ పన్ను అంటూ ప్రభుత్వం వాయింపుడు అని వారు వాపోయారు. ఇక పైబర్ గ్రిడ్ లో కేబుల్ తీసుకున్నవారికి టివీ చూడాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కుమారుడు లోకేష్నుచేప్పే విషయాలు అంటే ప్రభుత్వ పదకాల గురించి చచ్చినట్టు చూడాల్సివస్తోంది చెప్పారట. ఇది ఎంత చవకబారు పుబ్లిచిత్య్ అని ప్రజలకు ఎంతో చికాకు కలిగించే విషయమని వారు జగన్ కి వివరించారు.

కార్పొరేట్‌ అండర్‌ గ్రౌండ్‌ పేరుతో కేబుల్ ఆపరేటర్ల పై టీడీపీ పెత్తనం గురించి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫైబర్‌ గ్రిడ్‌ చట్టం తీసుకువస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అంతేకాక పోల్‌ ట్యాక్స్‌ ను పూర్తిగా తీసి వేస్తామని కూడా జగన్‌ హామీ ఇచ్చారు.