Home రాజకీయాలు అంటే…రాజ్య సభ సీట్ల కోసం బాబు కి సపోర్ట్ చేసావా పవన్?

అంటే…రాజ్య సభ సీట్ల కోసం బాబు కి సపోర్ట్ చేసావా పవన్?

SHARE

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఓ కొత్త విషయ౦ చెప్పారు. అంధ ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మోసం చేసిన విషయం పవన్ తెలియపరిచారు. విజయవాడ లో మాట్లాడిన పవన్‌ 2014 ఎన్నికలప్పుడు జన సేన 60 లేదా 70 స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్నట్టు చంద్రబాబుతో చెప్పానన్నారు…దానికి చంద్రబాబు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని తనని ఒప్పించి, ఎన్నికల తర్వాత రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పారన్నారు.

అయితే తరవాత ఆ రోజు మాట్లాడింది ఒకటైతే యెల్లో మీడియా పేపర్లలో చంద్రబాబు రాయించింది వేరు అన్నారు. ఇక రాజ్య సభ సీట్ల ఊసే ఎత్తకుండా మోసం చేసింది చెప్పారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే జన సేన కు కొన్ని సీట్లు వచ్చి ఉండేవి అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏపీలో యువత కు జాబు రాలేదు గానీ వాళ్లబ్బాయి లోకేష్‌కు మాత్రం మినిస్టర్ జాబ్‌ వచ్చిందని పవన్ అన్నారు.

ఇక పోతే పవన్ ఏమి ఆశించకుండా టీడీపీ బీజేపీ లకు సపోర్ట్ చేసాను అని అనటం అబద్ధం…తాను చెప్పినట్టు రాజ్యసభ సీట్లు ఆశించినట్టే కదా.