Home రాజకీయాలు “జగన్ కోసం బాబు యూ టర్న్ తీసుకున్నాడు”

“జగన్ కోసం బాబు యూ టర్న్ తీసుకున్నాడు”

SHARE

చంద్రబాబు ఓడిపోవాలని తిరుమల కొండకి ఎక్కేటప్పుడు ప్రతిమెట్టుకు మొక్కుకున్నానని తెదేపా బహిష్కృత నేత సీనియర్ రాజకీయవేత్త మోత్కుపల్లి నరసింహులు అన్నారు. తిరుమల కొండ ఎక్కేటప్పుడు తన కి బీపీ కూడా బాగా డౌన్ అయిందని… ఆసుపత్రిలో వుంది చికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చిందని అన్నారు.

బాబు ఒట్టి మోసకారి అన్న మోత్కుపల్లి లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి అన్యాయం జరిగిందని ఏ ఒక్క నేతా మాట్లాడలేదని ఎందుకంటే బాబు మోసకారి అని అందరికీ తెలుసని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై ఏ ఒక్క పార్టీ టీడీపీతో కలవలేదని మోత్కుపల్లి అన్నారు.

ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని, హోదానే కావాలని ఆనాడే బాబు స్పష్టం చేసి ఉంటే… ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చి ఉండేదని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు, జగన్ 2019 ఎలక్షన్ లో గెలుస్తాడని తెలిసి ఆ భయంతోనే బాబు యూటర్న్ తీసుకుని హోదా గురించి మళ్ళీ మాట్లాడుతున్నారని మోత్కుపల్లి విమర్శించారు. బాబు వైఖరి ఏపీ ప్రజలు గమనించాలని ఆయన కోరారు.