Home రాజకీయాలు ప్రత్యేక హోదా పోరాటంలో జగన్ తో బాబు చేయి కలుపుతాడా?

ప్రత్యేక హోదా పోరాటంలో జగన్ తో బాబు చేయి కలుపుతాడా?

70
SHARE

ఆంధ్ర ప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 24న రాష్ట్ర వ్యాప్త బంద్ కు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ పిలుపునిచ్చారు. టీడీపీ ఎంపీ లు ఏకతాటి పై నిలబడి రాజీనామాలు చేసి నిరాహార దీక్షలకు కూర్చోవాలని కూడా జగన్ అన్నారు.

రాష్ట్రంలో మొత్తం అందరు ఎంపీలూ రాజీనామాలు చేసి కనక పోరాటం చేస్తే ప్రత్యేక హోదా తప్పక వస్తుంది అని జగన్ అన్నారు. లోక్‌సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌, భాజపాలు కనీసం మాట్లాడలేదని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏపీ కి సంబంధించిన అంశాలపై అర నిమిషం కూడా మాట్లాడలేదని జగన్ విమర్శించారు.

ఏపీ ప్రజల హక్కులను తాకట్టుపెట్టే అధికారం కేంద్రానికి గాని చంద్రబాబుకు గాని ఎవరు ఇచ్చారని జగన్ నిలదీశారు. నిన్న లోక్‌సభలో ప్రత్యేకహోదాకు సంబంధించి ఎంపీ గల్లాజయదేవ్‌ చెప్పింది తమ పార్టీ గత నాలుగేళ్లుగా చెబుతున్నదేనని గుర్తు చేశారు. ఇంకా జయదేవ్‌ మాటలు.. అసెంబ్లీలో తాము మాట్లాడిన మాటలు ఒకసారి వీడియో లు చూడాలని కోరారు. ఆనాడు తాము మాట్లాడితే అపహాస్యం చేశారు.. ఈ రోజు అదే మాట్లాడుతున్నారు అని తెదేపాని ఎద్దేవా చేశారు జగన్.

ఇక తెదేపా వైకాపా తో బంద్ లో పాలుపంచుకుంటుందా….వారి ఎంపీ లు రాజీనామా చేశారా అనేది వేచి చూడాలి!!