Home రాజకీయాలు రాహుల్‌ కౌగిలింత.. కన్ను గీటడం ట్విటర్‌లో వైరల్

రాహుల్‌ కౌగిలింత.. కన్ను గీటడం ట్విటర్‌లో వైరల్

52
SHARE

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన పనులు చర్చనీయంగా మారాయి. ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ వద్దకు వెళ్లి కౌగిలించుకుని మరీ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వటం.. ఆపై తన కుర్చీలో కూర్చుని కన్నుకొట్టడం..  వంటి చర్యలతో రాహుల్‌ గాంధీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సభా వేదికగా జరిగిన ఈ ఊహించని పరిణామంతో ప్రధానితో సహా  సభలో ఉన్నవాళ్లంతా విస్మయం వ్యక్తం చేశారు.

కౌగిలింత.. కన్ను కొట్టడం వంటి సరదా సన్నివేశాలతో సీరియస్‌గా జరిగే పార్లమెంట్‌లో సైతం నవ్వులు పూశాయి. లోక్‌సభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా.. సీరియస్‌గా అప్పడి వరకు విమర్శలు ఎక్కు పెట్టిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఒక్కసారిగా ప్రధాని దగ్గరకు వెళ్లి కౌగలించుకోవడం, ఆ తర్వాత వచ్చి కన్ను గీటడం హాట్‌టాఫిక్‌గా మారింది. లోక్‌సభలో నిన్న జరిగిన ఈ డ్రామాటిక్‌ సీన్లపై ఇప్పటికీ ట్విటర్‌ మారుమోగిపోతోంది.

.