Home ప్రత్యేకం మోడీ కాళ్లు మొక్కిన టీడీపీ ఎంపీలు..

మోడీ కాళ్లు మొక్కిన టీడీపీ ఎంపీలు..

56
SHARE

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీపై సరికొత్త ఆరోపణ చేశారు. నిన్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీ కాళ్లను తెలుగుదేశం పార్టీ ఎంపీలు మొక్కుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఒకవైపు బీజేపీని తిడుతూ మరోవైపు టీడీపీ ఎంపీలు బీజేపీ కాళ్లకు మొక్కుతున్నారని దీన్ని తాము ఎలా అర్థం చేసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు.

బీజేపీపై యుద్ధం చేస్తామంటున్న టీడీపీ ఎంపీలు.. నిన్న ప్రధాని మోడీకి పాదాభివందనం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు, పవన్‌ ట్వీట్లు చేశారు. తెలుగుదేశం ఇప్పటికీ మిత్రులేనని రాజ్‌నాథ్ సింగ్‌ చెబుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసేది ధర్మపోరాటం ఎలా అవుతుందని పవన్ ప్రశ్నించారు.

ఎంపీ గల్లా జయదేవ్‌పై పవన్‌ సెటైర్లు పేల్చారు. గతంలో గల్లా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ఫోటోను ఉంచారు. గజిని చిత్రంలో హీరోలాగా టీడీపీ వాళ్లకి Convenient Memory loss Syndrome రోజు రోజుకీ పెరిగిపోతోంది.