Home రాజకీయాలు అవిశ్వాసం వీగిపోయినందుకు కాదు బాధ…కేసీఆర్ తో పోల్చినందుకు!

అవిశ్వాసం వీగిపోయినందుకు కాదు బాధ…కేసీఆర్ తో పోల్చినందుకు!

SHARE

తెదేపా అవిశ్వాసం వీగిపోయేదే అని మొదటి నించి అనుకుంటున్నది. అనుకున్నట్టు గానే…పెద్ద తేడా తో లోక్ సభ లో మోడీ విశ్వాసం గెలుచుకున్నారు. అయితే అది కాదు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కి బాధ కలిగిస్తున్నది…తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో తనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోల్చడం చంద్రబాబు నాయుడును బాగా కుంగదీసినట్టు గా వుంది. డిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు దీనిపై ఆయన స్పందించారు. తన కంటే కేసీఆర్‌ పరిణతితో వ్యవహరించారని మోదీ అనడం పై కామెంటు చేస్తూ ప్రధాని అలా మాట్లాడొచ్చా అని బాబు ప్రశ్నించారు.

ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మోడీ ఎప్పుడు మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. తానూ కాదు యూ టర్న్‌ తీసుకున్నదనీ ఇచ్చిన హామీలు అమలు చేయని మోడీ నే యూటర్న్‌ తీసుకున్నట్టని చంద్రబాబు అన్నారు.

గాలి జనార్దనరెడ్డి అనుచరులకు కర్నాటకలో ఎవరు టికెట్లు ఇచ్చారని ప్రశ్నించి వైసీపీ ట్రాప్‌లో తాను పడ్డానని అనటం కరెక్ట్ కాదన్నారు…బాబు నిజ౦గానే బాగా మండినట్టుంది!!