Home రాజకీయాలు మోడీ స్పీచ్ బ్లాక్ బస్టర్ సినిమాలా వుంది:కేశినేని నాని!

మోడీ స్పీచ్ బ్లాక్ బస్టర్ సినిమాలా వుంది:కేశినేని నాని!

SHARE

ప్రదాని మోడీ అద్బుతంగా మాట్లాడారని, అయన ప్రపంచ ఉత్తమ నటుడు అని విజయవాడ ఎమ్.పి కేశినేని నాని అన్నారు. మోడీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పై జరిగిన చర్చలో భాగంగా చివరిగా మోడీ ప్రసంగించారు.

మోడీ మంచి ఉపన్యాసకూడని కితాబునిస్తూ తనకు తెలిసిన కళని మోడీ సమర్దవంతంగా ప్రదర్శించారని నాని అన్నారు. మోడీ స్పీచ్ ఓ బ్లాక్ బస్టర్ సినిమా చూసినట్లు గా ఉందని అన్నారు. 2014 కి ముందు కూడా మోడీ ప్రజలను ఇలానే మోసం చేశారని, అనేక వాగ్దానాలను చేశారని గుర్తుచేశారు. రామాయణం, భారతం గురించి ఉద్ఘాటించి ఏపీ కి ఇచ్చిన హామీల గురించి మాత్రం మాట్లాడలేదని ఆయన వాపోయారు. అశాస్త్రీయ విభజన కు కాంగ్రెస్ బిజెపి పార్టీలు రెండూ బాద్యత వహించాలని కేశినేని నాని అన్నారు.

రాష్ట్రాన్ని మోడీ కైమా చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగు తనకు తల్లి అని మోడీ అంటున్నారని…అలాంటి తల్లిని ఎలా మోసం చేయగలుగుతున్నారో అని మోడీ గొప్ప యాక్టర్ అని ఒప్పుకోవాలని నాని అన్నారు.