Home రాజకీయాలు బాబు ధన్యవాద ప్రసంగాలు పార్లమెంటు లో వినిపిస్తే….

బాబు ధన్యవాద ప్రసంగాలు పార్లమెంటు లో వినిపిస్తే….

54
SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పగా అవిశ్వాసం ప్రకటించారు…దానికి మంచి సపోర్ట్ కూడా కూడగట్టుకున్నారు. కానీ బీజేపీ నాయుడు ని వదిలేలా లేదు…పైగా పాత రికార్డులను బయటకు తోడుతోంది. రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వ చర్యని దుయ్యబడుతూ గతంలో కేంద్రం ప్రత్యేక పచ్కగె ప్రకటించినపుడూ, సాయం చేయడం పై చంద్రబాబు ఎలా దన్యవాదాలు తెలిపారని ఇప్పుడు అవిశ్వాసం అంటూ ఎలా డ్రామాలు ఆడుతున్నారని అడిగారు.

అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రసంగాలు, కేంద్రానికి, ప్రదాని నరేంద్ర మోడీకి దన్యవాదాలు తెలిపిన తీర్మానాలు పార్లమెంటులో గనక వినిపిస్తే రాష్ట్రం పరువు అంతే సంగతులని ఆయన అన్నారు.

ఇంకా మహానాడు తీర్మానాల్లో కూడా కేంద్రంపై ప్రశంసలు కురిపి౦చీ ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టిన విషయాన్ని చంద్రబాబుకు కన్నా గుర్తు చేశారు.

మాటలు మారుస్తూ నాటకాలు ఆడటం కూడా ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు అన్నారు. చంద్రబాబు ఆడుతున్న నాటకాల్లో ఈ అవిశ్వాస తీర్మానం కూడా ఒకట చెప్పి బాబుని ఎద్దేవా చేశారు.

గతంలో కేంద్రంపై వైకాపా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చినప్పుడు వాటిపై స్పందించిన బాబు అవిశ్వాసం వల్ల ఒరిగేదేమిటని మాట్లాడటం గుర్తు చేసారు. మరి ఈ నాడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతూ కేంద్రంపై అవిశ్వాసానికి ఏ మొహం పెట్టుకుని పూనుకొన్నారని కన్నా మండిపడ్డారు.