Home రాజకీయాలు అవిశ్వాస నిలబడుతుందా…జేసీ అడ్డం తిరగడం బాబు కి ట్రబులే

అవిశ్వాస నిలబడుతుందా…జేసీ అడ్డం తిరగడం బాబు కి ట్రబులే

147
SHARE

అవిశ్వాస తీర్మానం తో తెలుగుదేశం పార్టీ ఆశించింది పొలిటికల్ మైలేజీ…ఇది తెలియంది ఎవరికీ? తాము కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామ౦టూ డప్పులు కొడుతున్న టీడీపీ నాయకులు బీజేపీతో టీడీపీ నాలుగేళ్ల పాట సంసారం గురించి మాట్లాడ్డానికి సంశయించటం ఇందుకు సాక్ష్యం.

అసలు హోదా అన్న వాళ్ళు జైలుకే అన్న బాబు మాటలు ప్రజలు ఎవరూ మర్చిపోరు…ఇప్పుడు మైలేజీ కోసం ఎలెక్షన్లు దగ్గర పడుతుండగా తెలుగుదేశం పార్టీ రచ్చ చేయాలని చూస్తోంది. అవిశ్వాస అంటూ విపరీతమైన హడావుడి చేస్తోంది.

ఇక తీర్మానం సంగతి అటుంచితే కథ అనుకోని మలుపు తిరిగింది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో గుబులు రాజేస్తున్నారు. తాను అవిశ్వాస తీర్మానం ఓటింగుకు వచ్చేది లేదని జేసీ తేల్చేశాడు. ఢిల్లీలో వాతావరణం బాగోలేదని, తను అవిశ్వాస తీర్మానానికి హాజరైనా హాజరు కాకపోయినా పెద్దతేడా ఉండదని కాబట్టి తను రావడం లేదని జేసీ చెప్పారు.

ఇదే తెలుగుదేశం పార్టీ తలనొప్పి అయ్యేలా వుంది. తాము అవిశ్వాస౦ పెడుతున్న తరుణంలో తమ పార్టీ ఎంపీ నే సభకు హాజరు కాకపోవడం పార్టీకి తలవంపులు తెచ్చేలా వుంది. ఓ వైపు బాబు పై విపరీతమైన విశ్వాసం తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది

కానీ సొంత పార్టీ ఎంపీనే అవిశ్వాస తీర్మానానికి హాజరు కాకపోతే బాబు సమాధానం చెప్పుకోగలడా? ఇక తెదేపా నాయకులంతా ఒకే పని మీద ఉన్నారట…జేసీ ని బుజ్జగి౦చే పని. అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తున్న తెలుగుదేశం పార్టీకి జేసీ తీరుతో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది!!