Home రాజకీయాలు విప్ జారీచేసిన హై కమాండ్ కి షాకిచ్చిన జేసీ!

విప్ జారీచేసిన హై కమాండ్ కి షాకిచ్చిన జేసీ!

SHARE

కేంద్ర ప్రభుత్వంపై తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఎంపీలకు టీడీపీ విప్ జారీ చేసి౦ది. బీజేపీ, త్రిణమూల్ పార్టీ లు కూడా తమ ఎంపీ లకు విప్ లు జారీచేశాయి.

శుక్ర, సోమవారాల్లో ఉభయసభలకు తమ ఎంపీలందరూ ఖచ్చితంగా హాజరు కావాలని విప్ లో ఆయా పార్టీ లు ఆదేశించాయి. అయితే, తెదేపా ఆదేశాలను పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బేఖాతరు చేస్తున్నారు. తాను ఢిల్లీకి వెళ్లేది లేదంటూ పార్టీకే షాక్ ఇచ్చారు జేసీ. ఈ రెబెల్ ఎంపీ ప్రస్తుతం తన సొంత ఊరైన అనంతపురంలో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ‘మేము ఎందుకు అవిశ్వాసతీర్మానం పెడుతున్నామన్న విషయాన్ని మా కొలీగ్స్ చాలా క్లియర్ గా చెబుతారు. సో నే వెళ్లినా, వెళ్లకపోయినా పెద్ద ప్రమాదం లేదు. నా అభిప్రాయం ప్రకారం, ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకూ మనకు ఏమీ రాదు.

ఇంకా ఆయన మాట్లాడుతూ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు నేను హాజరు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పడానికే తప్ప మేం సాధించేదే౦ లేదు. తోటి ఎంపీలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్లందరూ నాకు మంచి మిత్రులు వారితో ఎటువంటి విభేదాలు లేవు.

ఈ సమావేశాలకు హాజరుకావడం లేదనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడికి చెప్పారా అనే ప్రశ్నకు జేసీ స్పందిస్తూ, ఆ అవసరం లేదని అన్నారు. అయితే తెదేపా ఎంపీల బృందానికి నాయకత్వం వహిస్తున్న సుజనా కి జేసీ కి మధ్య చెడిందని తెలుస్తోంది. సుజనా సొంతపోకడలు జేసీ కి నచ్చడం లేదని భావిస్తున్నారు…అందుకే జేసీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలుస్తోంది.