Home రాజకీయాలు పాపాల చిట్టా….బయటపెట్టకుండా బెదిరింపులేమిటి సామి?

పాపాల చిట్టా….బయటపెట్టకుండా బెదిరింపులేమిటి సామి?

SHARE

బారతీయ జనతా పార్టీ నేతల మాటలు చూడండి ఎలా వుంటాయో. చేతల్లో చూపిందేమో సూన్యమాయె కానీ మాటలు కోటలు దాటిస్తున్నారు. భాజపా ఎమ్.పి జివిఎల్ నరసింహారావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై విమర్శనాస్త్రాలు గురిపెట్టి….బాబు పాపాల చిట్టా తన వద్ద ఉందని, పార్లమెంటులో దానిని బయటపెడతానని నిప్పులు చెరిగారు.

తెదేపా నేతలు రంగస్థలాన్ని బట్టి డ్రామాను మారుస్తున్నారనీ….టీడీపీ అంటే టోటల్‌ డ్రామా పార్టీ అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ డ్రామాలను పార్లమెంట్ సాక్షిగా ఎత్తి చూపుతాం అన్నారు జీవీఎల్. ప్రజలు బాబుని ఎన్నుకున్న పాపానికి 1500 రోజులుగా భరిస్తున్నారన్నారు.

బాబు పాపాల చిట్ట ప్రజల ముందు పెడతాం….తెదేపా వారి బాగోతాలను బయట పెడతాం అన్నారు. ఇంకా తెలుగుదేశ౦ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిందన్నారు. ప్రజలు చీ కొడుతున్నారన్నారు. తెదేపా అవిశ్వాసం పెడితే చర్చకు రెడీ అని కూడా అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు పచ్చ బ్రాండ్ వేసుకొంటున్నారని నిప్పులు చెరిగారు.

ఎందుకండీ పాపాల చిట్టా వుంది ఉంది అనటం….ఎవరు ఆపుతున్నారు బయటపెట్టకుండా?? అసలు నాలుగేళ్లు ఆ పాపాల చిట్టా ఎట్లా దాచారో…!!