Home రాజకీయాలు ఏమిటేమిటీ కేటీఆర్ కి ప్రమోషన్??

ఏమిటేమిటీ కేటీఆర్ కి ప్రమోషన్??

SHARE

కేటీఆర్ ఒక సిన్సియర్ మినిస్టర్. తన మినిస్ట్రీ కి వన్నె తెస్తూ పని చేస్తున్న తెలంగాణ మంత్రి. అయితే అంతకన్నా పెద్దడి ఆయన కేసిఆర్ వారసుడు. కేటీఆర్ ని సీఎం ని చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు తెరాస సీనియర్ నేత, రాష్ట్ర హోం మంత్రి నాయిని. కేసీఆర్ కు నాయని బహు సన్నిహితుడు అ౦దుకే ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకురావడం సంచలనమై౦ది, చర్చనీయాంశంగా మారుతోంది.

కేసీఆర్ కి ఆప్తుడైన నాయని ఆయన మనసెరిగిన నేతగా కూడా మనకి తెలుసు…అందుకే కేసీఆర్ మనసు తెలుసుకుని ఈ వాదన తీసుకొచ్చారు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చిస్తున్నారు.

నాయని వాదన కేసీఆర్ ను దించేయటం కాదు కేవలం కేటీఆర్ ను సీఎం కాండిడేట్ గా ప్రాజెక్ట్ చేయటమే. ఇక స్వయంగా నాయిని లాంటి వారు ఇలా మాట్లాడట౦ బట్టి చూస్తే త్వరలో కేటీఆర్ కు సీఎం పదవి కట్ట బెట్టిన పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఇలా ఉంటే, 2019 ఎన్నికల్లో పోటీకి కేటీఆర్ తన టీం తో పక్కాగా పోటీ చేస్తారు, కేటీఆర్ కోటరీ లో వాళ్లకే టికెట్లు దక్కబోతున్నాయని సమాచారం. సీనియర్లనీ ఎంపీలు గా పంపేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు. సీనియర్లు కేటీఆర్ కు అడ్డం కారాదని కేసీఆర్ వాళ్లని ఎంపీ లుగా పంపే ప్రణాళికను చేసుకున్నట్టు సమాచారం.