Home రాజకీయాలు జనసేన సభ్యత్వ లక్ష్యం 2కోట్లా? యూట్యూబ్ వ్యూస్ ఏమన్నానా?

జనసేన సభ్యత్వ లక్ష్యం 2కోట్లా? యూట్యూబ్ వ్యూస్ ఏమన్నానా?

99
SHARE

జన సేన పార్టీ కి 2కోట్ల మందిని భాగస్వాములుగా చేయడమే తమ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాద్ లో ‘జన సేన’ ఐటీ సెంటర్ ను, గిడుగు వెంకట రామ్మూర్తి ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రారంభ౦ చేసిన పవన్ సామాజిక, రాజకీయ బాధ్యతతో కూడిన వ్యవస్థ తమ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో తీసుకు వస్తుందని స్పష్టం చేశారు. 800 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా జన సేన ఐటీ సెంటర్ లో పనిచేస్తున్నారని, స్వచ్ఛందంగా పని చేసేందుకు వచ్చిన ఐటీ నిపుణులను ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, మిస్డ్ కాల్ ద్వారా తమ పార్టీ సభ్యులుగా 10 లక్షల మంది చేరారని, ఇక క్షేత్ర స్థాయిలో సభ్యత్వ నమోదు కోసం 20 లక్షల సభ్యత్వ పుస్తకాలు పంపించాం అన్నారు.

సమాజం కోసం, దేశం కోసం పాతికేళ్ళు ఈ రాజకీయాల్లో ఉండేందుకు నేను పని చేయాలని సిద్ధమై వచ్చాను. ఎంతో ప్రేమాభిమానాలతో ఈ ఐటీ సెంటర్ లో పని చేయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. రెండు కోట్లా సభ్యత్వ లక్ష్యం అంటే చిన్నా చితకా విషయం కాదు…యూట్యూబ్ పోస్ట్ లో వచ్చే లైకులు డిస్ లైకుల్లా అంత సులభమైన విషయమైతే కాదు…కదా?