Home రాజకీయాలు తిరుమల దర్శనాలు ఆపొద్దన్న బాబు…మంచిది!

తిరుమల దర్శనాలు ఆపొద్దన్న బాబు…మంచిది!

SHARE

తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాసంప్రోక్షణ సందర్భంగా దర్శనాలు నిలిపేస్తూ టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకున్న సంగతి పాఠకులకు తెలిసిందే.

అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రతిపక్ష పార్టీలు పలురకాలుగా విమర్శలు చేస్తుండడంతో పాటు, స్వాములు సాధువులు కూడా దుయ్యబట్టడం తో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పాలక మండలి సభ్యులతో మరియు అధికారులతో సమావేశమై పూర్తిస్థాయిలో దర్శనాలు నిలిపేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

పరిమిత సంఖ్యలోనైనా దర్శనాలకు అనుమతి ఇవ్వాలని, మహాసంప్రోక్షణ సమయంలో దర్శనాలు నిలిపేయడం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. అలానే పూజ మరియు ఇతర కార్యక్రమాలకు ఎలాంటి విఘాతాలు కలగకుండా చూసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు.

తిరుమల ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆలయం మూసివేత, టీటీడీ ఉద్యోగులకు సెలవులు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు అన్నారు. తాను చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేవిగా ప్రభుత్వ నిర్ణయం ఉందని ఆయన అన్నారు. సిసి టీవీలు ఆపడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

ఇలా ఆలయాన్ని ఎన్నడూ మూయలేదని, పోటు తవ్వకర, ఆభరణాలు గల్లంతు అయ్యాయన్న ఆరోఫణలకు ఈ చర్యలు బలం ఇస్తున్నాయని రమణ దీక్షితులు అన్నారు, ఇక స్వామి దర్శనాన్ని భక్తులకు దూరం చేయడం బాదాకరమని అన్నారు.

దర్శనాలు నిలిపేయడంపై నిన్ననే వైసిపిఎమ్మెల్యే రోజా తిరుమలలో ప్రభుత్వాన్నిఘాటుగా విమర్శించారు. స్వామి పరిపూర్ణానంద కూడా ప్రజల దర్శనాలు ఆపడం త్రాగడని హితవు పలికారు. దర్శనాలు ఆపడం లాంటివి ప్రభుత్వానికి ఏ మాత్రం మంచి చేయవని చెప్పారు.