Home రాజకీయాలు ఏపీ లో భాజపా పొత్తు ఎవరితో అంటే…!!

ఏపీ లో భాజపా పొత్తు ఎవరితో అంటే…!!

150
SHARE

రూమర్ లకు తెర దించుతూ ఆంద్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ తమ పార్టీ ఇక్కడ ఒంటరిగానే పోటీచేస్తుందని స్పష్టం చేశారు.

మీడియా తో ఈ విషయాన్ని చెప్తూ తమకు ఇది బిజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా కూడా తెలిపారని అన్నారు. ఎపిలో కుక్కను నక్కగా, నక్కను కుక్కగా చూపించే యత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని కన్నా ఆరోపించారు.

అయితే ఈసారి మాత్రం చంద్రబాబు సఫలం కాలేరని కన్నా అభిప్రాయపడ్డారు. ఎపిలో పోలీస్ స్టేషన్ లు అన్నీ కూడా టిడిపి సొంత ఆఫీస్ ల మాదిరి తయారయ్యాయని కన్నా ఆరోపించారు. అన్యాయానికి గురౌతున్న ప్రజలు కంప్లైంట్ లు ఇవ్వటానికి కూడా పోలీస్ స్టేషన్ లకు వెళ్లలేని పరిస్థితి ఉందని కన్నా విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలపై కేంద్ర హోంమంత్రిని సోమవారం కలసి ఫిర్యాదు చేయనున్నట్టు కూడా కన్నా తెలిపారు.