Home ప్రత్యేకం మోక్షజ్ఞ తో రకుల్ లవ్ ఎఫైర్??

మోక్షజ్ఞ తో రకుల్ లవ్ ఎఫైర్??

188
SHARE

ఎన్టీఆర్ బయోపిక్ కోసం నటీ నటుల ఎంపిక దాదాపుగా పూర్తయిందని చెప్పొచ్చు. బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్య బాలన్ ను ఎంపిక చేసారు, చంద్ర బాబు పాత్ర కోసం రానా ను తీసుకొన్నారు. తాజాగా రకుల్ఎ ని ఎంపిక చేశారు.

అయితే సినిమా లో ఒక పాల అమ్మాయి పాత్ర కి రకుల్ ను తీసుకున్నారు. ఎన్టీఆర్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఊరిలో చిన్న లవ్ స్టోరీ లు నడిపారట. రకుల్ పాత్ర చిన్న‌దే అయినా ఆ మూమెంట్స్ ఫ‌న్నీగా ఉంటాయ‌ని యూనిట్ వ‌ర్గాల సమాచారం.

ఇక బాల‌య్య కుమారుడు మోక్షజ్ఞ‌ ఎన్ఠీఆర్ చిన్నప్పటి పాత్ర చేయబోతున్నాడు. అంటే మోక్షజ్ఞ ర‌కుల్ ప్రీత్ మ‌ధ్య ప్రేమ రొమాన్స్ స‌న్నివేశాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. వయసు వ్యత్యాసం బాగా వున్న రకుల్ మోక్షజ్ఞల మధ్య ప్రేమ మేజిక్ క్రిష్ ఎలా చూపిస్తాడో అని అప్పుడే ఫాన్స్ అనుకోవటం గమనార్హం.