Home రాజకీయాలు నాది రైతు పార్టీ…:సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

నాది రైతు పార్టీ…:సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

SHARE

తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, తనది రైతు పార్టీ అని సీబీఐ మాజీ జే డీ లక్ష్మీనారాయణ అన్నారు. త్వరలోనే లక్ష్మి నారాయణ తెదేపా తీర్ధం పుచ్చుకుంటారు అన్న రూమర్ ల మధ్య మాజీ జే డీ క్లారిటీ ఇచ్చారు. రైతు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ఒకవేళ పరిష్కారం లభించని దశలో మహారాష్ట్ర తరహాలో 40 వేల మంది రైతులతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.

కార్పొరేట్ సంస్థల వల్లే రైతులెంతో నష్టపోతున్నారని… అదే కానక రైతులు సంఘటితంగా ఏర్పడి ఉంటే కార్పొరేట్ శక్తులను ఆపవచ్చని జే డీ చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని రైతులు రైతు నాయకుల తో సమావేశమైన జే డీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ, తన రాజకీయ ప్రధానం గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.