Home రాజకీయాలు ఈనాడు ఫ్రంట్ పేజీ ఫోటో వార్త…ఎం సూచిస్తున్నాయి?

ఈనాడు ఫ్రంట్ పేజీ ఫోటో వార్త…ఎం సూచిస్తున్నాయి?

110
SHARE

భారతీయ జనతా పార్టీ దేశ అద్యక్షుడు అమిత్ షా ఈనాడు గ్రూపు సంస్థల చీఫ్ రామోజీరావును కలవటం పలు రకాల ఊహాగానాలకు ఊతమిచ్చినట్టైంది. ఏ నాడైతే తెదేపా ఎన్డీఏ నుంచి వైదొలగిందో ఆ రోజు నించి ఈనాడు మీడియా తెలుగుదేశం పార్టీకు ఎక్కువ అనుకూలంగా వార్తలు ఇస్తూ, భాజపాకి వ్యతిరేకంగా మారింది అన్న భావన ఉండేది. చంద్రబాబు కు ప్రదాని మోడీల మధ్య వచ్చిన అంతరం తర్వాత షా రామోజీ ల కలయిక కి రాజకీయ ప్రాదాన్యత ఏర్పడింది.

ఓ పక్క షా రామోజీరావు ని కలవటానికి వస్తే అదే సమయంలో విశాఖ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తో చంద్రబాబు సామరస్యంగా కనపడటం చెప్పుకోదగ్గ పరిణామం. ఈ రోజు ఈనాడు హెడ్లైన్స్ మరియూ ఫ్రంట్ పేజీ ఫోటో కూడా ఆసక్తికరంగా వున్నాయ్.

రామోజీరావు, అమిత్ షాలు సుమారు గంట సేపు వరకూ మాట్లాడుకున్నట్టు వార్తలు సూచిస్తున్నాయి. టిడిపి, బిజెపి ల మద్య రామోజీ రావు సఖ్యత చేకూర్చారా అన్న విషయం తెలియాల్సి ఉంది.