Home సినిమా సెక్స్ రాకెట్: కిషన్, చంద్రలను దోషులుగా ప్రకటించిన కోర్టు!

సెక్స్ రాకెట్: కిషన్, చంద్రలను దోషులుగా ప్రకటించిన కోర్టు!

SHARE

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేకెత్తించి కకాలం సృష్టిస్తోన్న టాలీవుడ్ సెక్స్ రాకెట్ లో నిందితులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రలను అమెరికా కోర్టు దోషులుగా తేల్చింది. వాదనలను విని, సాక్షాలు పరిశీలించిన కోర్టు వీరికి 18న శిక్షను ఖరారు చేయనుంది. గరిష్టంగా పదేళ్ల వరకు కిషన్ మరియూ చంద్రలకు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయి.

తెలుగు అసోసియేషన్ ల కొరకు ఈవెంట్ల పేరుతో టాలీవుడ్ హీరోయిన్లను అమెరికాకు పిలిపించి, వారి లో కొంత మందితో బలవంతంగా వ్యభిచారం చేయించారన్న ఆరోపణలు రుజువయ్యాయని అమెరికా కోర్టు ప్రకటించింది. వీసా లను టూరిస్టు పర్మిట్ లను దుర్వినియోగం చేశారని నమ్మింది, అనైతిక కార్యక్రమాలలో పాత్రులను చేయటం కోసం మహిళలను అక్రమంగా రవాణా చేశారని ప్రకటించింది.

కిషన్ మోదుగుముడి టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా కూడా చేశారు…. అటు పిమ్మట అమెరికాలో సెటిల్ అయ్యాడు. తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని హీరోయిన్లను అమెరికాకు పిలిపిస్తూ, వారితో అనైతికంగా వ్యభిచారాన్ని కొనసాగించాడు. కొన్నేళ్లపాటు కొనసాగిన వీరిద్దరి దందా ఈ మధ్యనే చికాగో పోలీసులు చేధించారు!!