Home ప్రత్యేకం కృతజ్ఞత చూపించారుగా….నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి!!

కృతజ్ఞత చూపించారుగా….నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి!!

SHARE

ఆంధ్ర ప్రదేశ్ విభజన తరువాత జరిగిన ముఖ్య పరిణామాలలో అప్పటి ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి జై సమైఖ్యఆంధ్ర పార్టీ పెట్టటమే. నల్లారి కాంగ్రెస్ ను వీడటం పెద్ద విశేషం అయ్యింది అప్పట్లో. అయితే తన పార్టీ నించి కిరణ్ పోటీ కూడా చేయపోవటం ఇంకా విచిత్రమైయ్యింది. 2014ఎలక్షన్ లో ఆ పార్టీ కి డిపాసిట్లు గల్లంతైయ్యాయి…అంతే నల్లారి తెర మరుగయ్యారు….ఇక ఎప్పటికి రాజకీయాలలో నల్లారి ఉండరేమో అనుకుంటున్నా తరుణంలో తిరిగి కాంగ్రెస్ లో ప్రవేశించి కిరణ్ కుమార్ రెడ్డి ఓ సంచలనానికి తెర తీశారు.

అయితే కాంగ్రెస్ లో చేరిన వెంటనే తాను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిని అని మాజీ ముఖ్యమంత్రి ప్రకటించడం విశేషం. మీడియాతో మాట్లాడుతూ తన బంధం కాంగ్రెస్ తో విడదీయలేనిదని నల్లారి అన్నారు.తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇచ్చిందని, తన తండ్రి నాలుగు సార్లు, తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేలు గా పోటీ చేసి గెలిచామంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లేనే అని ఆయన అన్నారు.

గాంధీ కుటుంబంతో సన్నిహితంగా ఉండడం వల్లే చీఫ్ విప్, స్పీకర్, ముఖ్యమంత్రి వంటి పదవులు తనకి దక్కాయని కూడా ఆయన చెప్పారు. విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, కాంగ్రెస్ అదికారంలోకి వస్తే అది ఖచ్చితంగా సాద్యమౌతుందని ఆయన అన్నారు. విభజన తరువాత కాంగ్రెస్ ను వీడిన నేతలు అందరినీ తిరిగి పార్టీలోకి తీసుకు వస్తామని ఆయన అన్నారు.