Home రాజకీయాలు “ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎటు పోయిందబ్బా పవన్?”

“ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎటు పోయిందబ్బా పవన్?”

125
SHARE

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఇటీవలి కాలంలో పవన్ తెదేపా ప్రభుత్వం పై దాడి చేస్తుండటం తెలిసిన విషయమే. పవన్ వ్యాఖ్యల పై తెదేపా నాయకులు ఎదురు దాడి కి దిగుతున్న వేళా చంద్రబాబు కూడా తానూ సైతం అంటూ కలిశారు.

పవన్ స్టార్ట్ చేసిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ పై సెటైర్లు వేస్తూ ఎక్కడా ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అని అడిగారు. ఇంకా పవన్ ఎందుకు కేంద్రం ఇవ్వని నిధులపై మాట మెదపడం లేదో అన్నారు. ఇంకా డెబ్భై వేల కోట్లు రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సి ఉందనీ ఇదెందుకు పవన్ కి కనపడ్డం లేదో అంటూ పెదవి విరిచారు.

ఇన్ని చేసిన రాష్ట్రం అభివృద్ధి చెందడం చూసి కేంద్రం మరో దారి లేక ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ కి మొదటి రాంక్ ఇచ్చారన్నారు.

నిజమే కదా ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎటు పోయిందబ్బా పవన్?