Home సినిమా ఎర్ర చందనం స్ముగ్గ్లింగ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ నటుడు హరి!

ఎర్ర చందనం స్ముగ్గ్లింగ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ నటుడు హరి!

SHARE

నటుడిగా నిరూపించుకోవాలన్నఆశయంతో ఇండస్ట్రీ కి వచ్చిన ఇచ్చిన పాత్రలు ఎలాంటివన్నా చేస్తూ, టీవీ సీరియల్స్ లో నటిస్తూ, జబర్దస్త్ కార్యక్రమంలో ఓ మెట్టు పైకెక్కిన సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హరి శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కోట్లకు పడగలెత్తాడు అంటే నమ్మగలమా?

అంతేనా షకలక శంకర్ హీరోగా నటించిన శంభో శంకర చిత్రానికి ఫైనాన్స్ కూడా అందించినట్టు సమాచారం. తిరుపతికి చెందిన హరి గురించి పక్కా ఆధారాలు దొరకటం తో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇతని కోసం గాలి౦చి అరెస్ట్ చేశారు.

హరి తమిళనాడు, కర్ణాటకలలో బడా బడా స్మగ్లర్లతో సంబంధాలు పెంచుకుని ఎర్రచందనాన్నిస్ముగ్గ్లింగ్వి చేస్తూ కోట్లల్లో డబ్బు సంపాదించాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇతనిపై 20 కేసులు నమోదు చేశారు.
ఇంకా షాకింగ్ విషయమేమిటంటే హరి తో పాటుగా కొందరు విద్యార్థులు, పల్లెల్లో పనిచేసే డాక్టర్లు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఎర్రచందనం అక్రమ రవాణాలో పార్టనర్ లు గా గుర్తించి వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

సెక్స్ రాకెట్ తోనే టాలీవుడ్ కి చెడ్డ పేరు అంటే, ఇప్పుడు ఎర్రచందనం మకిలి కూడా ప్చ్…!!