Home రాజకీయాలు ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ సరే….నిజంగా ఎన్ని పరిశ్రమలొచ్చాయో చెప్పండి!

ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ సరే….నిజంగా ఎన్ని పరిశ్రమలొచ్చాయో చెప్పండి!

254
SHARE

సులభతర వాణిజ్యం (ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్) లో ఏపీ కి మొదటి స్థానం వచ్చిందనే విషయం తెలిసిందే. దేశం లోనే ఫస్టు గా రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

పరిశ్రమల రంగంలో ఏపీ నెంబర్ ఒన్ గా ఉ౦దని చెప్పిన బాబు రాష్ట్రానికి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వచ్చాయని అన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి వేదింపులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. పరిశ్రమల విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని బాబు తెలిపారు.

ఇదిలావుంటే…అంటే రాష్ట్రం పెట్టుబడులలో ముందంజలో ఉంటే కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఏపి బ్రాండ్ దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.

ఇక్కడే విచిత్రం…ప్రత్యేక హోదా…మరియు పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదల లాంటి అంశాలపై ప్రభుత్వమే దీక్షలు చేసింది…ఈ మధ్యనే తెదేపా రాజ్య సభ సభ్యుడు సి ఎం రమేష్ 11రోజుల నిరాహారదీక్ష కూడా చేశారు.

దీక్షలు వేరే ఎవరు చేసినా కూడా అది ఏపీ బ్రాండ్ కి తూట్లు పొడవటమే ….మరి మీరు చేసే దీక్షలా మాటేమిటి సీఎం సారూ…? అసలు అంతేసి లెవెల్ లో పరిశ్రమలు నిజంగానే వస్తుంటే, ఉద్యోగాలు కూడా వచ్చేస్తుంటే దీక్షల అర్ధం ఏమిటి? ఎందుకసలు దీక్షలకు దిగటం

ప్రత్యేక హోదాపై ఒక మూడు సార్లు మాట మార్చి నిరసనలకు దిగడం ద్వారా చంద్రబాబే ఎపి బ్రాండ్ ను ఎంత ఎత్తుకి తీసికెళ్లారో సీఎం గారే చెప్పాలి.

సులభంగా వాణిజ్యం చేసుకోవడం లో మన రాష్ట్రం నెంబర్ వన్ గా రావడం చాలా మంచిదే. కానీ నిజంగా పరిశ్రమలు రావటం అంతకన్నా ఎక్కువ ఉపయోగం….ఇక పరిశ్రమలు వచ్చాయా అంటే …చూద్దాం ఇంకా ఓ 10నెలల సమయం ఉందిగా!!!