Home రాజకీయాలు పోన్లే పాదయాత్ర కు జనాలొస్తున్నారని ఒప్పుకున్నావ్ గలీజ్ ఖాన్…సారి జలీల్ ఖాన్!!

పోన్లే పాదయాత్ర కు జనాలొస్తున్నారని ఒప్పుకున్నావ్ గలీజ్ ఖాన్…సారి జలీల్ ఖాన్!!

SHARE

పార్టీలు మారితే మాటలు ఎలా మారతాయో చూడండి. గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి గెలిచిన జలీల్ ఖాన్ తదనంతరం ఏ కారణమైతేనే పార్టీ ఫిరాయించి అదికార తెదేపాలో చేరారు.

ఇక ఇప్పుడు ఆయనేం అంటున్నారో చూడండి….రాష్ట్రంలో ఇసుక మాఫియా కి చంద్రబాబు కి సంబంధం వుంది అని జగన్ అన్న వేళ ….జలీల్ ఖాన్ జగన్ పై విరుచుకుపడ్డాడు….ఇసుక గురించి జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

అంతేనా జగన్ సైతాన్ అంటూ కామెంట్లు. వైకాపా అధ్యక్షుడి పాదయాత్ర కేవలం తనను తాను రక్షించుకునేందుకే అంటూ జలీల్ ఖాన్ పెదవి విరిచారు. పాదయాత్రకు జనమొస్తే గెలిచినట్లు కాదని అన్నారు. పోనీలే జగన్ పాదయాత్రకు జనం వస్తున్నారని ఆయన ఒప్పుకున్నట్టే గా!!

ఇక వైకాపా కి అరవై ఏడు సీట్లు వస్తే ఏ శిక్ష కైనా సిద్దమని ఆయన అన్నారు. అంతే కాదు మరో మంచి జోక్ కూడా పేల్చాడు గలీజ్ ఖాన్….సారి జలీల్ ఖాన్. చంద్రబాబు అనుమతిస్తే అట తాను కన్నా లక్ష్మీనారాయణ పైన తన కుమార్తె జగన్ పైన పోటీచేయడానికి సిద్దమని అన్నారు.

ఇన్ని ఎందుకు సామి తమరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉంటే ఎన్ని డప్పులు కొట్టినా వింటాం కదా అది తప్ప అన్నీ చేస్తారు గా….!!