Home రాజకీయాలు జమిలి ఎన్నికలకి వైకాపా సై!!

జమిలి ఎన్నికలకి వైకాపా సై!!

114
SHARE

దేశ వ్యాప్తంగా ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరగాలన్న ప్రతిపాదనను వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ సమర్దించింది. దేశంలో లోక్ సభ ,అసెంబ్లీ లకు ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రజా ధనం అధికంగా వృధా కాకుండా ఉంటుందని తమ పార్టీ భావిస్తున్నట్లు లా కమిషన్ కు వైకాపా తెలిపింది.

ఎమ్.పి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్ కు ఈ మేరకు పార్టీ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఉమ్మడి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు ఏమి కొత్త కాదని వీరు తెలిపారు. 2004 నుంచి 2014 వరకూ ఏపీలో ఎన్నికలు అదే విధంగా జరుగుతూ వస్తున్నాయని కూడా గుర్తు చేసారు అందుకే జమిలి ఎన్నికలను వైఎస్సార్‌ సీపీ సమర్ధిస్తోందని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు, ఎన్నికల అవినీతి రెండూ కూడా బాగా తగ్గుతాయని పార్టీ అభిప్రాయంగా తెలిపారు. ఇంకా ఓటుకు నోటు లాంటి కేసులు కూడా ఆవృతం కావని వారు అభిప్రాయపడ్డారు.

అయితే అనివార్య కారణాల వాళ్ళ ప్రభుత్వాలు పడిపోతే ఏమి చేస్తారని పార్టీ తరపున ప్రశ్నించామని, మిగిలిన కాలానికే ఎన్నికలు జరుగుతాయని లా కమిషన్ చైర్మన్ తెలిపినట్టు వారు వివరించారు.