Home సినిమా ఏవీ నీ అందమైన కురులు సోనాలీ??

ఏవీ నీ అందమైన కురులు సోనాలీ??

SHARE

ముగ్ధమనోహరమైన మోము, ఎంతో సుకుమారమైన రూపం, అసలు ఎక్సపోసింగ్ అనేది లేకుండా మంచి పాత్రలలో మెరిసిన రారి భామ సోనాలి బెంద్రే కాన్సర్ తో పోరాడుతున్న సంగతి తెలిసిందే.

ప్రపంచానికి తన కాన్సర్ గురించి కొద్ది రోజుల క్రితమే తెలియజేసి అభిమానులని దుఃఖంలో ముంచిన సోనాలి తాజాగా తన కాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా తన జుట్టు కత్తిరించుకుని తీయించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి౦ది. ఈ ఫోటో అభిమానుల చేత కంట నీరు పెట్టిస్తోంది.

ఆమె కాన్సర్ నయం కావలని కోరుకొని అభిమాని లేరు…కోలుకునే అవకాశాలు ఉన్నాయి కానీ అప్పటి వరకూ జుట్టు లేని సోనాలిని చూడాలంటె అభిమానులకు కష్టమే. హెయిర్ కట్ చేయించుకున్న వీడియో కూడా సోనాలి ట్విట్టర్ లో పోస్ట్ చేయటం విశేషం.

అదేం ఖర్మో సినిమా రంగంలో వారు ఎక్కువ శాతం కాన్సర్ బారిన పడటం శోచనీయం. అత్యంత ఆధునిక చికిత్స పద్ధతులు వచ్చాయి అందుకే కాన్సర్ అంటే ఆమ్మో అనే ఆలోచన పోయింది. అయితే కొన్నాళ్ల పాటు ఆ ట్రీట్మెంట్ నరకం తప్పదు…..రేడియేషన్ కి జుట్టు ఊడిపోవడం చాలా సహజం…సోనాలి ముందస్తు గా ప్రిపేర్ అయ్యి ఫాన్స్ ని ప్రిపేర్ చేస్తోంది…..ఆమె కాన్సర్ ని జయించి రావాలని కోరుకుందాం!!