Home రాజకీయాలు “దుర్మార్గుడైన బాబుని బొందపెట్టాలే..!!”

“దుర్మార్గుడైన బాబుని బొందపెట్టాలే..!!”

SHARE

తెలంగాణకు చెందిన సీనియర్ నేత, టిడిపి నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నరసింహులు కాలినడకన తిరుమల కొండ పైకి వెళ్లడానికి సిద్దమయ్యారు.

రేపు అనగా జులై 11న ఉదయం తొమ్మిది గంటలకు అలిపిరి నుంచి కాలి నడకన తిరుమలకి వెళ్లి దేవ దేవుడిని దర్శించుకుంటానని పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. మోత్కుపల్లి రేపు తన అరవైనాలుగో పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా వేంకటేశ్వరుడిని దర్శించుకో తలపెట్టారు.

తన మానసిక వ్యధ, క్షోభ ఆ దేవుడికి చెప్పుకోటానికి తిరుమల వెళ్తున్నట్టు మోత్కుపల్లి తెలిపారు. చంద్రబాబు నాయుడు కు వ్యతిరేక శక్తులన్ని ఏకమై దుర్మార్గుడైన బాబుని రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానని చెప్పారు. ముఖ్యంగా దళితులు, బలహీనవర్గాలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని మోత్కుపల్లి వేడుకున్నారు.