Home రాజకీయాలు కత్తి పై బహిష్కరణ వేటు…అతిక్రమిస్తే మూడేళ్ళ జైలు!

కత్తి పై బహిష్కరణ వేటు…అతిక్రమిస్తే మూడేళ్ళ జైలు!

SHARE

హిందూ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌ పై ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించడం జరిగింది. ఈ ఆరు నెలలో పోలీసు అనుమతి లేనిదే హైదరాబాద్‌లోకి కత్తి మహేష్ ప్రవేశి౦చరాదని, ఒకవేళ అది అతిక్రమించి వస్తే అరెస్టు చేస్తామని. ఒకవేళ అదే జరిగితే అతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడటం ఖాయామని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కత్తి మహేశ్‌ నగర బహిష్కరణపై డీజీపీ అధికారిక ప్రకటన చేశారు.

భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కు అయినా దానివల్ల సమాజంలోని ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించడం ప్రతి పౌరుని ధర్మ౦ అలా కాదని ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయన్నారు. కత్తి మహేష్ లాంటి వారు కొంత మంది సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సమాజంలో అలజడులు రేకెత్తించేలా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు.

భావ వ్యక్తీకరణ పేరుతో టీవీ ఛానళ్లను వేదికగా చేసుకుని కత్తి మహేష్మె జార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలకు నిరసనగా కొన్ని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా స్పందిస్తున్నాయని డీజీపీ చెప్పారు. అందువల్ల అతడిని 6 నెలల పాటు నగరం నుంచి బహిష్కరించినట్లు తెలిపారు.

ఇక కత్తి మహేశ్‌ను పోలీసులు ఆయన స్వస్థలమైన చిత్తూరుకు తరలించారు. అక్కడే ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. కత్తి పై 3 కేసులు నమోదయ్యాయి అని డీజీపీ తెలిపారు. మరో పక్క కత్తి మహేష్ వ్యాఖ్యలు చేసిన టీవీ ఛానల్ వారికి షో కాజ్ నోటీసులు ఇచ్చారు!!