Home రాజకీయాలు టీటీడీపై సుప్రీంలో స్వామి పిటిషన్!

టీటీడీపై సుప్రీంలో స్వామి పిటిషన్!

276
SHARE

గత కొంతకాలంగా టీటీడీ హెడ్ లైన్స్ లో ఉంటోంది. దేవస్థానం గురించి అలజడి చెలరేగుతున్న సంగతి పాఠకులకు తెలిసిందే. స్వామివారి పింక్ డైమండ్ ను మాయం చేశారని, నిధుల కోసం తవ్వకాలు చేపట్టారంటూ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చంద్రబాబు ప్రభుత్వం పైన ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, టీటీడీ ప్రధాన అర్చక పదవి నించి రమణ దీక్షితులు ని తప్పించటం కూడా జరిగింది.

అయితే రమణ దీక్షితులు ఢిల్లీ వెళ్లి ఎంపీ సుబ్రమణియన్ స్వామి ని కలిసి తన ఆరోపణలు అనుమానాలు ఆయనతో పంచుకున్నారు. ఇక తాజాగా టీటీడీ లో నెలకొన్న వివాదాలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారని.

స్వామి ఈ నెల 19న సుప్రీమ్ లో పిటిషన్ వేస్తానని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నియంత్రణ నుంచి టీటీడీని తొలగించాలన్నదే స్వామి పిటిషన్ సారాంశ౦ అని తెలుస్తోంది. స్వామి వారి ఆభరణాల మాయంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని గతంలోనే స్వామి డిమాండ్ చేయడం తెలిసిందే.

దేవాలయ నిర్వహణను సాధువులకు అప్పగించాలని… లేకపోతే లూటీ ఇలాగే కొనసాగుతుందని స్వామి చెప్పారు.