Home సినిమా ప్రియాంక నిశ్చితార్థం?

ప్రియాంక నిశ్చితార్థం?

SHARE

బాలీవుడ్ అందాల రాశి మరియూ హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా గత కొంత కాలంగా హాలీవుడ్ నటుడు నిక్ జోనస్ తో ప్రేమలో ఉన్న విషయం మా పాఠకులకు తెలిసిందే. ఇటీవలే నిక్ ని ఇండియా కి తీసుకొచ్చి తన తల్లి మధు చోప్రాకు కు ప్రియాంక పరిచయం చేసింది కూడా…..ఇక ఎటూ అందరికి తెలిసిన విషయమే అనుకుందో ఏమో ఏ మాత్రం బిడియం లేకుండా నిక్ తో చట్టాపట్టాలేసుకుని తిరగడ౦ మొదలుపెట్టింది…అయితే తాజాగా ఈ ప్రేమ జంట సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రియాంక, నిక్‌ చేతులకి ఒకే మోడల్‌ గల రింగ్స్‌ ఉండటమే ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. కానీ ఇంత జరుగుతున్నా ప్రేమ, పెళ్లిలపై ప్రియాంక ఇంతవరకు ఎటువంటి ప్రకటనా చేయకపోవడం ఒకింత ఆశ్చర్యమే.