Home సినిమా తొలి పాటతో ‘గీత గోవిందం’ సిద్ధం

తొలి పాటతో ‘గీత గోవిందం’ సిద్ధం

SHARE

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న గీత గోవిందం కు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్రయూనిట్ ఇటీవల ప్రారంభించారు. విజయ్‌ తనదైన స్టైల్‌లో ట్వీటర్‌ వేదికగా ఆసక్తికర కామెంట్స్‌తో సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాడు విజయ్‌.

ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, పోస్టర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్‌ జూలై 10న తొలి పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. గోపి సుందరం సంగీత సారధ్యంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటను మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. పరుశురామ్‌ దర‍్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్‌ గా నటిస్తున్నారు.