Home రాజకీయాలు మీ ఫామిలీ గురించి మాట్లాడానో…దట్స్ ఆల్!!

మీ ఫామిలీ గురించి మాట్లాడానో…దట్స్ ఆల్!!

120
SHARE

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై కఠినచర్యలు తీసుకోవాలని నటుడు నాగబాబు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఎక్కడా కత్తి మహేష్ పేరెత్తకుండా, ఆయనపై మండిపడ్డారు నాగబాబు. అయితే నాగబాబు కి కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ కౌంటర్ ఇచ్చారు. ఓ వీడియోను పోస్టు చేసిన కత్తి, నాగబాబును టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు.

తన పేరు చెప్పకుండా, తనను నీచుడిగా సంబోధించిన వీడియోను తాను చూసినట్టు పేర్కొన్న కత్తి దాన్ని చూసిన తరువాత తనకు జాలి కలిగింద౦టు పేర్కొన్నాడు. తాను ఎందుకు నీచుడినో చెప్పాల౦టూ నాగబాబు ని అడిగారు.అన్నకి తమ్ముడిగా తమ్ముడికి అన్నగా తప్ప, మరే విధంగా చూసినా అస్థిత్వం లేని నాగబాబు తన గురించి మాట్లాడుతున్నారని వాపోయారు.

మెగా కుటుంబం ఏమైనా రామ భక్తులా అంటూ ప్రశ్నించిన కత్తి, ప్రజలను మోసం చేస్తూ, ఉన్న పార్టీలను అమ్ముకుని వేరే పార్టీలో చేరడం, ‘జబర్దస్త్’ లాంటి చెత్త ప్రోగ్రాంలో జడ్జీగా కూర్చుని పిచ్చి నవ్వులు నవ్వడమే సమాజానికి నాగబాబు చేస్తున్న సేవ అంటూ సెటైర్లు విసిరారు. వారి కుటుంబం, సోదరుల గురించి తాను కనుక నోరు విప్పి మాట్లాడితే తట్టుకోవడం చాలా కష్టమని హెచ్చరిస్తూ, తాను చావడానికి సిద్ధమని, అయితే తనకి ఎం జరిగినా బాధ్యత నాగబాబు మరియూ పరిపూర్ణానంద స్వామిదేనని వార్నింగ్ ఇచ్చారు.

తాను చేసిన వ్యాఖ్యలను కనీసం అర్థం చేసుకోదానికి ప్రయత్నం కూడా చేయకుండా అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని కత్తి ఆరోపించారు. వారి రాజకీయ, సినీ జీవితాలు ఎంత దౌర్భాగ్యమో అందరికీ తెలిసే రోజు వస్తుందని…అలంటి పతనానికి వారే పునాదులు తవ్వుకుంటున్నారని అన్నాడు.

అలానే ఓ దళితుడిని నీచుడని సంబోధించారంటే, ఎంత అహకారం ఉండి వుండాలని…,కత్తి అన్నారు. కత్తి పోస్టు చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయింది!!!