Home రాజకీయాలు నన్ను ఏ పార్టీ ప్రేరేపించలేదు: రేణు దేశాయ్

నన్ను ఏ పార్టీ ప్రేరేపించలేదు: రేణు దేశాయ్

SHARE

పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందులో రేణు దేశాయ్ జనసేన అధినేత మీద దారుణమైన ఆరోపణలు చేసినట్లు ఉంది. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను జనసేన అదినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదని రేణూ దేశాయ్ అన్నారు.

గత ఐదేళ్లుగా తనపై వస్తున్న విమర్శలకు పవన్ అబిమానులు ఎందుకు స్పందించలేదని ఆమె అన్నారు. గతంలో నాకు వేధింపులు ఎదురైనపుడు మీరంతా ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వలేదు? ఆయనకో రూల్, నాకో రూలా? అంటూ ఫైర్ అయ్యారు. పవన్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు ఓ వ్యక్తి కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నాడని, దీంతో కొందరు అభిమానులు పవన్‌కు మద్దతివ్వాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే.. మరికొందరు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని రేణు వెల్లడించారు. తనన కొందరు గత ఐదేళ్లలో ఇష్టం వచ్చినట్లు దూషించారని, అప్పుడు తన అత్మాభిమానం ముఖ్యం అన్న సంగతి వారికి గుర్తుకు రాలేదా అని ఆమ అన్నారు. ఇప్పుడు పవన్‌ పేరుకు మచ్చ వస్తుందన్న భయంతో తనని స్పందించమనడం ఎంత వరకు సబమని పవర్‌స్టార్‌ అభిమానులను ఆమె ప్రశ్నించారు. రేణూ దేశాయ్ గురించి పవన్ అబిమానులు పట్టించుకోకుండా ఉంటే మంచిది కదా!

Oh the irony!I really thought that finally I will be able to use my Instagram in peace but life is full of irony’s!The…

Posted by Renu Desai on Thursday, July 5, 2018