Home రాజకీయాలు కళ్యాణ్ గారికే విడాకులు కావాలి.. ఆయనే అడిగారు

కళ్యాణ్ గారికే విడాకులు కావాలి.. ఆయనే అడిగారు

164
SHARE

రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ విడిపోయి౦ది ఈ మధ్య కాదు…అయినా సరే ఈ ఇద్దరిలో ఎవరు విడాకులు కోరారు అనేది రేణు కానీ పవన్ కానీ ఎప్పుడు ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న రేణుదేశాయ్ ని అడిగినప్పుడు ఆమె స్పందిస్తూ …ఇంతకాలం చాలా ఇంటర్వ్యూ లలో ఈ ప్రశ్న అడిగినా నేను ఎప్పుడూ సమాధానం చెప్పలేదు….అయితే ఇప్పుడు నాకు మరొకరితో పెళ్లి ఫిక్స్ అయింది కనుక చెప్పొచ్చనుకుంటున్నానని ఆమె అనడం విశేషం.

ఏ ఇంటికైతే కోడలిగా వెళుతున్నానో వాళ్లు కూడా ఈ ప్రశ్న అడిగారు. జరగబోతోంది అరేంజ్డ్ మేరేజ్ కనుక .. ఈ విషయానికి సంబంధించి నేను ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలు వాళ్లు కూడా చూశారు. నా తప్పులేనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు ఆలోచించడం అంటూ వాళ్లు రేణు ని అడిగారు. అందుకే రేణు చెప్పడమే సరి అనుకోని చెప్పారు.

విడాకులు నేనేం అడగలేదు..ఇది కల్యాణ్ గారికి తెలుసు.. దేవుడికి తెలుసు…విడాకులు కావాలని కళ్యాణ్ గారే అడిగారు..నాకు కోపం వచ్చింది. విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు వస్తాయో….అదే వారిమధ్య జరిగింద౦టూ రేణు చెప్పారు. కళ్యాణ్ గారికే విడాకులు కావాలి.. ఆయనే అడిగారు..ఇది చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా వుంది” అంటూ రేణు ఇబ్బంది పడ్డారు.