Home రాజకీయాలు ఇంత అరాచకమా…13స౦ మైనర్ పై 18మంది అఘాయిత్య౦

ఇంత అరాచకమా…13స౦ మైనర్ పై 18మంది అఘాయిత్య౦

SHARE

బీహార్ లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పదమూడేళ్ల మైనర్ బాలికపై దాదాపు 7నెలలు అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అసలు కనికరమే లేకుండా ఓ 13స౦ బాలికపై విద్యార్థులు ఉపాధ్యాయులు అత్యచారం జరపడం ఎంత ఘోరం…. షాకింగ్గా ఓ పద్దెనిమిది మంది ఆ చిన్న పాప పై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆ బాలిక పోలీసులకు పిర్యాదు చేసింది.

గత ఏడాది డిసెంబర్ నెలలో తన తండ్రి జైలుకి వెళ్ళగానే తనకు లైంగిక వేధింపులు మొదలయ్యాయి అంటూ అ చిన్నారి పేర్కొంది. బిహార్‌లోని సరన్ జిల్లాలో తండ్రిలేని అ చిన్నారిని మొదటగా ఆమె క్లాస్ మెట్ అత్యచారం జరిపినట్లు తెలిసింది. ఇక ఆపై వరుసపెట్టి ప్రిన్సిపాల్ తో సహా ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు తనపై 7నెలల పాటు అత్యాచారానికి పాల్పడుతూ వున్నారని బాలిక ఎక్మా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ సంఘటన వెలుగుచూసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక చెప్పిన వివరాల ప్రకారం అన్ని కోణాలనుంచి విచారిస్తున్నారు. ప్రిన్సిపాల్, ఇద్దరు విద్యార్థులతో పాటు అధ్యాపకులను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మరికొంత మంది నిందితులు పరారీ లో వున్నారని పోలీసులు వారి కోసం గాలిస్తున్నామన్నారు.