Home రాజకీయాలు బాబు చెబుతున్న మాటలే బీజేపీ అఫిడవిట్‌లో ఉన్నాయి

బాబు చెబుతున్న మాటలే బీజేపీ అఫిడవిట్‌లో ఉన్నాయి

122
SHARE
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలతో పాటు సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌ చూసిన రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు.  ఏపీకి అన్ని చేశామని బీజేపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా చెబుతున్న మాటలే ఇవాళ బీజేపీ నేతలు కోర్టులో వేసిన అఫిడవిట్‌లో  రుజువైందన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని వైయస్‌ జగన్‌ మొదటి నుంచి చెబుతుంటే..మాపై ఎదురుదాడి చేశారని, అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు. ఇవాళ పరిశ్రమలు మూతపడుతున్నాయని, మరోవైపు చంద్రబాబు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు నాటకాలాడుతున్నారన్నారు.
ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చేతకాని దద్దమ్మ అని, కృష్ణా జిల్లాకు పట్టిన దరిద్రమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి పార్థసారథి తీవ్రంగా ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారధి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు కట్టినట్లు ఉందని విమర్శించారు. నీటిపారుదల శాఖా మంత్రిగా ఉంటూ ఇసుక దోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు నాలుగేళ్లలో తామేదో సాధించినట్లు మంత్రిలా కాకుండా ఓ మంత్రసానిలా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ అఫిడవిట్‌ చూసి ఏపీ ప్రజలు రగిలిపోతున్నారని తెలిపారు.
సోమిరెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ టైంపాస్‌ కోసం విమర్శిస్తుందని అనడం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే..వారికి వెన్నుపోటు పొడిచేందుకు కత్తి ఇచ్చింది మీరు కాదా అని నిలదీశారు. విభజన చట్టంలో ఎన్నికల తరువాత ఆరు నెలల్లో ఏం చేయాలో చాలా స్పష్టం చెప్పారన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, గ్రీన్‌ఫీల్డ్‌ పరిశ్రమ, వైజాగ్‌–చెన్నై కారిడారు, రైల్వే జోన్‌ అన్ని కూడా ఆరు నెలలలోపు రాష్ట్రానికి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విభజన చట్టంలోని ప్రాథమిక హామీని అమలు చేయకపోయినా బీజేపీతో ఎందుకు కలిసి నాలుగేళ్లు పని చేశారని నిలదీశారు. కేంద్ర మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు ఒక్క మాటైనా మాట్లాడారా అన్నారు. దుగ్గిరాజుపట్నం 2018లోగా పూర్తి చేస్తామన్నారు. ఈ రోజు వరకు దానికి శంకుస్థాపన కూడా చేయలేదన్నారు. బీజేపీని విడనాడటానికి ముందు జనవరి 13, 2018న చంద్రబాబు ప్రధానిని కలిశారన్నారు. ప్రత్యేక హోదా గురించి అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అడగలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీ, టీడీపీలకు గుణపాఠం తప్పదని పార్థసారధి హెచ్చరించారు.