Home ట్రైలర్స్ అంచనాలు పెంచిన ‘ఆర్ఎక్స్ 100’ న్యూ ట్రైలర్

అంచనాలు పెంచిన ‘ఆర్ఎక్స్ 100’ న్యూ ట్రైలర్

SHARE

కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మిస్తున్న‌చిత్రం RX 100. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రావురమేష్, సింధూర పువ్వు రాంకీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. జులై 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సెకండ్ ట్రైలర్ విడుదల చేశారు. సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.